ETV Bharat / state

రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తాం: హరీశ్​రావు - హరీశ్​రావు తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అంశంపై ఇంకా పోరాడుతూనే ఉన్నామని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్న హరీశ్‌రావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

harishrao Wrath on ap government
రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తాం: హరీశ్​రావు
author img

By

Published : May 12, 2020, 3:38 PM IST

Updated : May 12, 2020, 4:47 PM IST

ప్రశ్న: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై తెలంగాణ ప్రభుత్వానికున్న అభ్యంతరాలు ఏమిటి?

జవాబు: రాష్ట్ర విభజన చట్టం సెక్షన్​ 85(8) ప్రకారం ఏ రాష్ట్రమైన కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలంటే అపెక్స్​ కమిటీ, కృష్ణా నదీజలాల బోర్డు అనుమతి తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నీటి తరలింపునకు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది. ఇది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది.

ప్రశ్న: తమకు కేటాయించిన ప్రకారమే నీటిని తీసుకుంటున్నామనే ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై మీ అభిప్రాయం?

జవాబు: నీటి కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. అదే విధంగా నాగరార్జున సాగర్​కు ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తే తెలంగాణకు నీరెట్లా వస్తుంది. దీనివల్ల హైదరాబాద్​లో తాగునీటి సమస్య తలెత్తుతుంది. పలు సాగునీటి ప్రాజెక్టులకు నీటి ఎద్దడి వస్తుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను నీరందని పరిస్థితి రావొచ్చు.

ప్రశ్న: తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా తమ హక్కు ప్రకారం నీళ్లు తీసుకుంటుంటే తెలంగాణకు ఉన్న అభ్యంతరమేమిటన్న ఏపీ నిర్ణయంపై మీరేమంటారు.?

జవాబు: ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం కంటే తక్కువ ఉన్నప్పుడు నీటిని తరలించడం తగదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి పదవులకు రాజీనామాలు చేశాం. గతంలో పెంచిన దానిపైనే నేటికీ ట్రిబ్యునల్​లో పోరాడుతున్నాం... అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇప్పుడు పెంచితే ఎలా అంగీకరిస్తాం.

ప్రశ్న: తెలంగాణ ప్రభుత్వం తరఫున... ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏచర్యలు తీసుకుంటారు?

జవాబు: ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. కేఆర్​ఎంబీకి లేఖ రాస్తాము. ట్రిబ్యునల్​లో కూడా తెలంగాణ తరఫున గట్టిగా వాదనలు వినిపిస్తాం. జీవోను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తాం.

రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి హరీశ్​రావుతో ముఖాముఖి

ఇదీ చదవండి: వేరే ఉపాధి చూసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులు

Last Updated : May 12, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.