ETV Bharat / state

ఆ ఘటనలు బాధాకరం.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: హరీశ్‌రావు - minister harish rao latest news

harish rao video conference: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల జరిగిన ఘటనలు బాధాకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు విచారం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఆ ఘటనలు బాధాకరం.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: హరీశ్‌రావు
ఆ ఘటనలు బాధాకరం.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: హరీశ్‌రావు
author img

By

Published : Sep 5, 2022, 10:00 PM IST

Updated : Sep 5, 2022, 10:25 PM IST

harish rao video conference: రాష్ట్రంలో డెంగీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ ఆయా శాఖల అధికారులతో సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్​, డీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఫీవర్‌ సర్వేను వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.

ఈ క్రమంలోనే రక్త హీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయాలని మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో గాంధీ ఆసుపత్రిలో 250 పడకల మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్​ సదుపాయం కలిగిన 53 అల్ట్రా సౌండ్​ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్యం, పరిసరాల పరిశుభ్రత, మందుల లభ్యత, ఆపరేషన్​ థియేటర్​లను పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం ఇన్సెన్‌టివ్‌లు ఇస్తోందన్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల జరిగిన ఘటనలు అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందన్న హరీశ్​రావు.. బాధ్యులను ఉపేక్షించబోయేది లేదన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రక్త హీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేయాలి. వచ్చే ఆరు నెలల్లో గాంధీ ఆసుపత్రిలో 250 పడకల మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్‌ సదుపాయం కలిగిన 53 అల్ట్రా సౌండ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందే వైద్యం, పరిసరాల పరిశుభ్రత, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్‌లను పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఇక రాష్ట్రంలో సాధారణ ప్రసవాలు పెంచేందుకు ప్రభుత్వం ఇన్సెన్‌టివ్‌లు ఇస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల జరిగిన ఘటనలు అత్యంత బాధాకరం. ఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. బాధ్యులను ఉపేక్షించబోయేది లేదు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. - హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి

Last Updated : Sep 5, 2022, 10:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.