ETV Bharat / state

'జూన్ నెల నుంచి పూర్తి జీతాలు, పింఛన్లు'

మంత్రి హరీశ్‌రావును కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక జూన్ నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని, 3 నెలల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జూన్​ నెల నుంచి జీతాలు, పింఛన్లు ఇవ్వడానికి ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అంగీకరించారు. బకాయిలను వాయిదాలలో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు.

minister harish rao spoke on employes salaries in telangana
జూన్ నెల నుంచి పూర్తి జీతాలు, పింఛన్లు ఇవ్వాలని మంత్రి నిర్ణయం
author img

By

Published : Jun 23, 2020, 1:50 PM IST

జూన్ నెల నుంచి పూర్తి జీతాలు, పింఛన్లు ఇవ్వటానికి ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అంగీకరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. జూన్​ నెల వేతనాలు పూర్తిగా ఇవ్వాలని, 3 నెలల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ జూన్ నెల నుంచి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారు. అదేవిధంగా బకాయిలకు సంబంధించి జీపీఎఫ్​లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు.

సీపీఎస్, పెన్షనర్లకు ఎలా ఇస్తారని ప్రస్తావించినప్పుడు.. వారి బకాయిలు వాయిదాలలో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని మంత్రి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలు కూడా జీపీఎఫ్​లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రి హరీశ్​ రావును ఐక్యవేదిక పక్షాన కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సీహెచ్ సంపత్ కుమార్ స్వామి, జి.సదానందంగౌడ్, కె.జంగయ్య, చావ రవి, వెంకటరెడ్డి, బి.రామకృష్ణ, ఎస్.విఠల్, పి.పురుషోత్తం పాల్గొన్నారు. హైదరాబాద్​ కొండాపూర్​లోని వసంత్ వ్యాలీ నివాసంలో మంత్రి హరీశ్​ రావును కలిసినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో నూతన క్రీడా విధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.