ETV Bharat / state

నేను భాజపాలో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు - ఓట్ల కోసం తప్పుడు ప్రచారం

నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సామాజిక మాధ్యమాల్లో భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయం ముందు భాజపా ధర్నా డ్రామా అని ఆయన అభివర్ణించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం కోసం భాజపా తరఫున 12 మంది కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానిని కూడా తీసుకొచ్చారన్నారు.

minister harish rao said bjp social media False propaganda
తప్పుడు ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు
author img

By

Published : Nov 30, 2020, 3:39 PM IST

Updated : Nov 30, 2020, 4:32 PM IST

ఫేక్ న్యూస్ చేయడంలో భాజపాకు నోబెల్ బహుమతి వస్తుందని మంత్రి హరీశ్​ రావు ఎద్దేవా చేశారు. తమ అధినాయకత్వం మొత్తం వచ్చినా.. హైదరాబాద్ ప్రజలు మొగ్గు చూపకపోవడంతో భాజపా ఆందోళనకు గురవుతోందని విమర్శించారు.

తాను, తమ పార్టీ ముఖ్య నేతలు భాజపాలో చేరుతున్నట్లు తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో గతంలో జరిగిన మత కల్లోలాలు, ప్రార్థన మందిరాల్లో మాంసం వేయడం వంటి వీడియోలు.. మళ్లీ ఇక్కడ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేయబోతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

భాజపా సృష్టించే తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాజపా దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉందన్నారు. పార్టీ శ్రేణులు సంయమనంతో ఉండాలని హరీశ్​ సూచించారు.

నేను భాజపాలో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు

ఇదీ చూడండి: ఆలస్యం కానున్న లెక్కింపు ప్రక్రియ

Last Updated : Nov 30, 2020, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.