ETV Bharat / state

Harish Rao Review: 'ప్రైవేట్​తో పోటీపడి ప్రభుత్వాసుపత్రుల్లో ఆర్థోపెడిక్​ సేవలందించాలి' - ts news

Harish Rao Review: జిల్లాల్లోని పెద్ద ఆసుప‌త్రులు కూడా రోగులను హైద‌రాబాద్‌కు రిఫ‌ర్ చేస్తున్నారని.. అలా కాకుండా జిల్లా ఆసుప‌త్రుల్లోనే వైద్యం అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లాల్లో అందించ‌లేని చికిత్సల‌కు మాత్రమే హైద‌రాబాద్‌కు పంపించాలని సూచించారు. జిల్లా ఆసుప‌త్రుల్లోనూ అధునాత‌న‌ వైద్య ప‌రిక‌రాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రైవేట్​ ఆస్పత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్థోపెడిక్​ వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి హరీశ్​ రావు ఆదేశించారు.

Harish Rao Review: 'ప్రైవేట్​తో పోటీపడి ప్రభుత్వాసుపత్రుల్లో ఆర్థోపెడిక్​ సేవలందించాలి'

author img

By

Published : Mar 20, 2022, 7:56 PM IST

Harish Rao Review: ప్రైవేట్‌తో పోటీపడి ప్రభుత్వాసుపత్రుల్లో ఆర్థోపెడిక్ సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు అధికారులను ఆదేశించారు.. ఆసుప‌త్రుల అభివృద్ధి కోసం విడుదల చేసిన ఆరోగ్యశ్రీ నిధులను... సూప‌రింటెండెంట్లు వినియోగించుకొని త‌గిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్​లోని ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆర్ధోపెడిక్ వైద్యులతో హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్ వైద్య సేవ‌ల అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స కోసం కావాల్సిన వసతులను ప్రభుత్వాసుపత్రుల్లో స‌మ‌కూర్చామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ర‌కాల ఆర్థోపెడిక్ చికిత్సల‌కు ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద అవ‌కాశం ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

మన దగ్గర అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని.. వారికి త‌గిన ఏర్పాట్లు చేసి పేద ప్రజ‌ల‌కు వైద్యం అందించే బాధ్యత మ‌నంద‌రిపై ఉంది. జిల్లా ఆసుప‌త్రుల‌ను బ‌లోపేతం చేశాం. ఆధునాత‌న‌మైన వైద్య ప‌రిక‌రాల‌ను అక్కడ స‌మ‌కూర్చాం. అంద‌రు సూప‌రింటెండెంట్లు, డైరెక్టర్లు సంబంధిత విభాగాల డాక్టర్లు, సిబ్బందితో స‌మావేశాలు ఏర్పాటు చేసుకొని, ఆసుప‌త్రి అవ‌స‌రాల గురించి చ‌ర్చించుకోని చిన్న చిన్న స‌మ‌స్యల‌ను వెంట‌నే ప‌రిష్కరించుకోవాలి. త‌మ ప‌రిధిలో ప‌రిష్కరించుకోలేని స‌మ‌స్యల‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రజ‌ల‌కు నాణ్యమైన వైద్య సేవ‌లందించే క్రమంలో ఎలాంటి అవ‌స‌రాల‌నైనా తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం బ‌డ్జెట్​లో వైద్య ప‌రిక‌రాల‌కు 500 కోట్లు, స‌ర్జిక‌ల్‌కు 200 కోట్లు, వైద్య ప‌రీక్షల‌కు 300 కోట్లు, మందుల‌కు 500 కోట్లు, ఆసుప‌త్రుల అభివృద్ధికి 1250 కోట్లు కేటాయించాం. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ వైద్య సేవలు అందించే వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు,ఇతర సిబ్బందికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. మరింత కష్టపడి పని చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. -హరీశ్​ రావు, రాష్ట్ర మంత్రి

ఈ పద్ధతిని ప్రభుత్వాసుపత్రుల్లో ఆచరించాలి..

ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ప్రణాళికాబ‌ద్ధమైన విధానం ద్వారా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మందికి చికిత్స ఇవ్వగ‌లుగుతున్నామని ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్యులు గురువారెడ్డి అన్నారు. ఇదే ప‌ద్ధతిని ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఆచ‌రిస్తే.. ఇంకా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. ప్రభుత్వానికి ఏ స‌మ‌యంలోనైనా స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నూత‌న చికిత్స విధానాల‌పై ప‌రిశోధ‌న‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని.. దానితో వైద్యుల‌కు ఆస‌క్తి పెరుగుతుందని పలువురు ప్రైవేటు వైద్యులు అన్నారు. ఉస్మానియా, గాంధీలో ఎంతో గొప్ప వైద్యులు ఉన్నారని.. నాణ్యమైన వైద్య సేవ‌లు అందుతున్నాయని.. మ‌రింత మంచి సేవ‌లు అందించే అవ‌కాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.