Harishrao Review On Health: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడం సహా ప్రైవేట్‌లో సీజేరియన్లపై పరిశీలన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఉన్నత అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య సూచీలో తెలంగాణను మొదటి స్థానంలో నిలపాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, డీఎంహెచ్ఓలతో నిర్వహించిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి సహా పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా వైద్యారోగ్య శాఖలోని ప్రతి విభాగం నుంచి ఉత్తమ పనితీరు కనబరిచిన ముగ్గురిని ఎంపిక చేసి సన్మానించనున్నట్టు తెలిపారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా నెలనెలా సర్ప్రైజ్ విజిట్లు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం ఎన్‌హెచ్‌ఎంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ, డీహెచ్, ఓఎస్డీ గంగాధర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలు, టీ డియాగ్నోస్టిక్స్, ఎన్సీడీ స్క్రీనింగ్, టీబీ వంటి విభాగాల పురోగతిని పరిశీలించారు.
ఇదీ చదవండి: పబ్‌పై పోలీసుల దాడులు.. అదుపులో ప్రముఖ సింగర్, నటులు