వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్(covid vaccination) పూర్తి చేయాలంటే అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు(minister harish rao) సూచించారు. రాష్ట్రంలో టీకా పంపిణీ మరింత వేగవంతం చేయాలన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో(DMHO) టెలీ కాన్ఫరెన్స్(teleconference) నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వికారాబాద్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
జనాభా ఎక్కువ ఉన్న పట్టణాల్లో ఇతర ప్రాంతాల్లోని సిబ్బందిని వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వోలకు మంత్రి హరీశ్ రావు(minister harish rao) సూచించారు. వికారాబాద్ జిల్లాలో వాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని మంత్రి తెలిపారు. అన్ని జిల్లాలు వికారాబాద్‌ను ఆదర్శంగా తీసుకుని వ్యాక్సినేషన్(covid vaccination) ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. డీఎంహెవోలు(DMHO) క్షేత్రస్థాయిలో ఉండి వాక్సినేషన్ డ్రైవ్‌లు నిర్వహించటంతోపాటు జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకు సాగాలని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: