ETV Bharat / state

కాళేశ్వరానికి జాతీయహోదాపై కేంద్రానిది దుష్ప్రచారం: హరీశ్‌రావు - హరీశ్​రావు ట్విటర్​

Minister Harishrao On Kaleswaram Project: కాళేశ్వరానికి జాతీయహోదాపై కేంద్రానిది దుష్ప్రచారమని ట్విటర్​ వేదికగా మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. జాతీయహోదా కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపలేదనేది అబద్ధమని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయహోదాను ఇచ్చే అవకాశమే లేదని ఆనాడు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

harishrao
harishrao
author img

By

Published : Mar 17, 2023, 9:48 PM IST

Minister Harishrao On Kaleswaram Project: రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని కేంద్రంలోని బీజేపీ​ ప్రభుత్వం.. తిరిగి ప్రతిపాదనలు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్​రావు ఆక్షేపించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందలేదని పార్లమెంట్​లో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు చేసిన ప్రకటనపై ఆయన ట్విటర్​ వేదికగా స్పందించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని.. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రిగా తాను ఉన్నప్పుడు.. ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్​లో బిశ్వేశ్వర్ తుడు చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని.. జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ అనుమతులు సైతం లభించాయని పేర్కొన్నారు. అనుమతులు అన్నీ వచ్చాకే జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్​లో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్​లో ప్రకటించారని గుర్తు చేశారు.

BJP Did Not Give National Status To Kaleswaram Project: అయితే అందుకు విరుద్ధంగా బీజేపీ పాలిక రాష్ట్రాలైన కర్నాటక, మధ్యప్రదేశ్​లోని అప్పర్ భద్ర, కెన్-బెట్వా ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రతిపాదనను పక్కన పెట్టడం.. రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని దుయ్యబట్టారు. ఇదే రాజకీయ వివక్షకు నిదర్శనమని విమర్శించారు. కృష్ణా జలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చిందన్నారు.

న్యాయవిచారణ పూర్తి కాక ముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించిందని హరీశ్‌రావు తెలిపారు. అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ఇవ్వలేదన్న ఆయన.. ఇది రాజకీయ కక్ష కాదా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు కాళేశ్వరం విషయంలో కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. వారినుంచి ఎలాంటి సహకారం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

  • CWC accorded approval to the Upper Bhadra Project of Karnataka, a BJP ruled State when KWDT II award was stayed by SC in 2013. CWC accorded clearances to Upper Bhadra Project and GoI also accorded NP status for a project when the whole matter was subjudice

    For Kaleshwaram… https://t.co/ZqSs2Ke5TY pic.twitter.com/yMhWsVWaV1

    — Harish Rao Thanneeru (@BRSHarish) March 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.