ETV Bharat / state

Harish Rao on Budget: ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్‌: హరీశ్‌రావు - Harish Rao on Budget

2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇవాళ వెల్లడి కానుంది. పద్దును నేడు ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో రైతులు, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి హరీశ్​ పేర్కొన్నారు.

Harish Rao on Budget
Harish Rao on Budget
author img

By

Published : Mar 7, 2022, 9:46 AM IST

Updated : Mar 7, 2022, 10:54 AM IST

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్‌: హరీశ్‌రావు

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేలా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో కేసీఆర్​ మార్కు కనిపిస్తుందన్నారు. రైతులకు, పేద ప్రజలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయల్దేరిన హరీశ్‌రావు.... బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

అక్కడి నుంచి శాసనసభకు మంత్రి హరీశ్​రావు చేరుకున్నారు. సభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి... బడ్జెట్‌ ప్రతులు అందించారు. కాసేపట్లో అసెంబ్లీలో పద్దును మంత్రి హరీశ్​ ప్రవేశపెట్టనున్నారు.

Harish Rao on Budget
బడ్జెట్‌ ప్రతులు అందించిన మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి

బడ్జెట్‌లో రైతులు, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్‌ ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశాం. ఈ బడ్జెట్​లో కేసీఆర్ మార్క్ కనిపిస్తుంది.

- హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఇదీ చూడండి: Telangana Cabinet Meeting: బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Last Updated : Mar 7, 2022, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.