Harish Rao: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో బయో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్సు పాలసీని అందుబాటులోకి తెచ్చామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గైనకాలజీ, ఆర్థోపెడిక్, వైద్య పరికరాల వినియోగంలో సాధించిన అంశాలపై చర్చించారు.
పది రోజుల్లో అన్ని ఆసుపత్రుల్లోని వైద్య పరికరాలను ఏఎంసీ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. రోగులను అవసరం అయినపుడు మాత్రమే హైదరాబాద్‌కు రిఫర్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీలైనంతగా సీజేరియన్లు తగ్గించాలని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Harish Tweet On Rahul : 'ఆ ఒక్క ప్రశ్నతో రాహుల్ గాంధీ సంగతేంటో అర్థమైంది'