ETV Bharat / state

బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు: హరీశ్‌రావు - మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Harish rao on chandrababu : ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయలేని చంద్రబాబు.. తెలంగాణను ప్రగతి పథాన తీసుకెళ్తానని మాయమాటలు చెబుతున్నాడని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు.

BRS
బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకు చంద్రబాబు డ్రామాలు: హరీశ్‌రావు
author img

By

Published : Dec 22, 2022, 3:17 PM IST

Updated : Dec 22, 2022, 5:11 PM IST

బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు: హరీశ్‌రావు

Harish rao on chandrababu: చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దోపిడీకి గురైందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అన్ని వర్గాలను ఆయన మోసం చేశారని విమర్శించారు. బుధవారం ఖమ్మంలో తెదేపా భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబుపై హరీశ్‌ విమర్శలు గుప్పించారు. శాసనసభాపక్ష కార్యాలయంలో సహచర మంత్రులు పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

చంద్రబాబు మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారని.. తెలంగాణ ప్రజలు వాటిని నమ్మరని హరీశ్‌రావు అన్నారు. ఏపీలో అభివృద్ధి చేయలేక తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారని విమర్శించారు. తెలంగాణలో తమకు బలముందని చూపించి భాజపాతో పొత్తు కోసమే ఆయన ఈ విధంగా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఖమ్మం సభకు పక్క రాష్ట్రం నుంచి జనాలను తరలించారని హరీశ్‌ ఆరోపించారు. ఏపీలో భాజపాతో పొత్తు కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు.

''ఏపీని అభివృద్ధి చేయలేక..తెలంగాణలో అభివృద్ధి చేస్తా అంటున్నారు. ఏపీని అప్పుల పాలు చేసి ఇక్కడకు వచ్చారు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దోపిడీకి గురైంది. అన్ని వర్గాలను మోసం చేసింది. ఉద్యోగాలు అడిగిన యువతను నక్సలైట్లతో కాల్చి చంపారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నినాదం ఐటీ. వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు. భాజపాతో పొత్తుపెట్టుకునేందుకు డ్రామాలు చేస్తున్నారు. భాజపా పొత్తుకోసమే వెంపర్లాడుతున్నారు. తెలంగాణలో ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్‌ విలక్షణ నేత.. ఆయన గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని చంద్రబాబు చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం మరచిపోలేదు.''- హరీశ్‌రావు, మంత్రి

రైతులపై భాజపాకు ఎందుకంత కక్ష: కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతులకు వ్యతిరేకమేనని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులపై భాజపాకు ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు. కల్లాలు కట్టడమే తప్పన్నట్లు పరిహారం చెల్లించాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో భారాస ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.

''కేసీఆర్‌ నాయకత్వంలోనే ఖమ్మానికి వైభవం. ఖమ్మం అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత చంద్రబాబు అన్యాయం చేసింది ఖమ్మం జిల్లాకే. చంద్రబాబు తన పలుకుబడితో రాత్రికి రాత్రే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో విలీనం చేయించారు. ప్రధానిపై ఒత్తిడి చేసి సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలుపుకొన్నారు. చంద్రబాబు హయాంలో ఖమ్మం జిల్లాకు ఒక్క ప్రాజెక్టైనా తెచ్చారా?. ఖమ్మానికి ఒక్క ప్రాజెక్టు తెచ్చినా నేను ముక్కు నేలకు రాస్తా. ఖమ్మం జిల్లాకు ఒక్క పరిశ్రమ లేదా ప్రాజెక్టైనా తీసుకొచ్చారా? చంద్రబాబు చెబుతున్న ఐటీని ఖమ్మానికి తీసుకొచ్చింది కేసీఆర్‌, కేటీఆర్‌. తెలంగాణ వచ్చాక ఖమ్మం అభివృద్ధికి రూ.1200 కోట్లు ఇచ్చారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. తన హయాంలో ఖమ్మానికి వైద్య కళాశాల వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆ కళాశాల నాది.. నా కష్టార్జితంతో ఏర్పాటు చేశా. నా కళాశాలకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది. ఖమ్మం ప్రజలమంతా సుఖంగా ఉన్నాం.. మమ్మల్ని ఆగం చేయొద్దు.'' - పువ్వాడ అజయ్, మంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Dec 22, 2022, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.