ETV Bharat / state

కేంద్రం గంటకు రూ.192కోట్లు అప్పు చేస్తోంది: హరీశ్‌రావు - బడ్జెట్‌పై ఉభయ సభల్లో సాధారణ చర్చ

Telangana Budget Sessions 2023-24 : రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు శాసన మండలిలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం గంటకు రూ.192కోట్లు అప్పు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 24 గంటల కరెంటు అనేది అధికార పార్టీ నేతలకు ఊతపదంగా మారిందని విమర్శించారు.

Telangana Budget Sessions 2023-24
Telangana Budget Sessions 2023-24
author img

By

Published : Feb 9, 2023, 1:38 PM IST

Telangana Budget Sessions 2023-24 : రైతులపై కేంద్రప్రభుత్వం కక్ష కట్టిందని మంత్రి హరీశ్ రావు శాసనమండలిలో మండిపడ్డారు. కేంద్రం గంటకు రూ.192కోట్లు అప్పు చేస్తోందన్న హరీశ్‌రావు.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఆపారని మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కేవలం 29.6 శాతం మాత్రమే వస్తోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1.27లక్షల కోట్లు ఆపేశారని వివరించారు.

24 గంటల కరెంటు అనేది అధికార పార్టీ నేతలకు ఊతపదంగా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే వాస్తవాలు తెలుస్తాయన్న ఆయన.... కనీసం 8, 9గంటలైనా విద్యుత్‌ సరఫరా అవటంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. శాసనమండలి సమావేశాల వేళ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన.... అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన అంశాలపై చర్చించకుండా..... అధికార పార్టీ సభ్యులు ఊతపదాలతో ఉపన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా నిరంతర విద్యుత్‌ సరఫరా వస్తుంటే.... సభలో చర్చించేందుకు సమస్యేంటని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.