Minister Harish Rao: ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చే వైద్య సంస్థలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో వైద్యరంగంలో రూ. 10వేల కోట్లు ఖర్చు చేస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న గ్రేస్ ఫౌండేషన్ 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మా తల్లిదండ్రులకు క్యాన్సర్
Minister Harish Rao About Cancer : ప్రపంచాన్ని కరోనా ఒకరకంగా వణికిస్తుంటే క్యాన్సర్ అనేది మరోరకంగా బాధపెడుతుందని హరీశ్‌రావు అన్నారు. మా కుటుంబం కూడా క్యాన్సర్ బాధిత కుటుంబమేని తెలిపారు. మా తల్లిదండ్రులిద్దరికీ క్యాన్సర్ సోకిందని మంత్రి పేర్కొన్నారు. తండ్రి 10ఏళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతుంటే... తల్లి 6ఏళ్ల నుంచి బాధపడుతుందని తెలిపారు. మిగితా రోగాలకంటే క్యాన్సర్ భిన్నమైందని అన్నారు. ఆ బాధ అనుభవించేవారికే తెలుస్తుంది... ఆ కుటుంబానికే అర్థమవుతుందని తెలిపారు. కరోనాకు శాస్త్రవేత్తలు తొందరగా టీకా కనుగొన్నారు. అలాగే క్యాన్సర్‌కు కూడా కనుగొనాల్సిన అవసరం ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
2 ఏళ్లు.. 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్
Harish Rao Latest News : వైద్య చికిత్సలు భారం అవుతున్న తరుణంలో అతి క్లిష్టమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు... ఎనిమిదేళ్లుగా రెండు వేల మంది వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గ్రేస్ ఫౌండేషన్‌ను కొనియాడారు. ఇలాంటి మరిన్ని సంస్థలు పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిని రూ. 120 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానాగా తీర్చిదిద్ది.. 450 పడకల స్థాయికి పెంచుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కిడ్నీ, గుండె, క్యాన్సర్ బాధితులతు మెరుగైన వైద్యం అందించేందుకు రెండేళ్లలో అయిదు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు.
"వైద్య చికిత్సలు భారం అవుతున్న తరుణంలో... అతి క్లిష్టమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఎనిమిదేళ్లుగా గ్రేస్ ఫౌండేషన్ సేవలందించడం అభినందనీయం. ప్రపంచాన్ని కరోనా ఒకరకంగా వణికిస్తుంటే క్యాన్సర్ అనేది మరోరకంగా బాధపెడుతోంది. మా కుటుంబం కూడా క్యాన్సర్ బాధిత కుటుంబమే. మా తల్లిదండ్రులిద్దరికీ క్యాన్సర్ సోకింది. మా తండ్రి 10 ఏళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతుంటే... తల్లి 6ఏళ్ల నుంచి బాధపడుతోంది. మిగితా రోగాలకంటే క్యాన్సర్ భిన్నమైనది. ఆ బాధ అనుభవించేవారికే తెలుస్తుంది. ఆ కుటుంబానికే అర్థమవుతుంది. కరోనాకు శాస్త్రవేత్తలు తొందరగా టీకా కనుగొన్నారు. అలాగే క్యాన్సర్‌కు కూడా కనుగొనాల్సిన అవసరం ఉంది."
-హరీశ్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి: ఓ చిన్నారి 'హృదయ వేదన'.. సాయం కోసం అర్థిస్తున్న తల్లిదండ్రులు