కులవృత్తిదారులు ఓనర్లుగా ఉన్న లాండ్రీలు, సెలూన్లకే ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పాత మీటర్లకే పథకం అమలు చేస్తామని.. మీటర్ లేనిచోట్ల ప్రభుత్వమే ఉచితంగా మీటర్లు అందిస్తుందని ప్రకటించారు. రజకులు, నాయీ బ్రాహ్మణుల దోబీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ అందించే పథకంలో తుది విధివిధానాల కోసం రజకులు, నాయీ బ్రాహ్మణుల సంఘాల నేతలతో మంత్రి గంగుల హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
ఇప్పటి వరకు రజకుల్లో కేవలం 200, నాయీ బ్రాహ్మణుల్లో 400 దరఖాస్తులే వచ్చాయని మంత్రి గంగుల పేర్కొన్నారు. లైసెన్సు, లీజు అగ్రిమెంట్ లేకున్నా ఈనెల 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దళారులు, మధ్యవర్తులకు ఆస్కారం లేకుండా ప్రక్రియ చేపడుతున్నామన్న మంత్రి.. స్వీయ ధృవీకరణలో తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అనర్హులను అడ్డుకునే బాధ్యత కుల సంఘాలు తీసుకోవాలని గంగుల సూచించారు.
ఇదీ చూడండి: రాజ్భవన్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం