ఈటల రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల వెంట ఉంటే ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమలు నడుస్తున్నాయని... గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కయ్యారా అంటూ ప్రశ్నించారు.
తమిళనాడువాసులు గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తుంటే ఎందుకు మాట్లాడలేదని... పన్నులు ఎగ్గొట్టానని నాపై విమర్శలు చేయడం తగదన్నారు. ఎక్కడైనా పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదు రెట్లు అధికంగా చెల్లిస్తానని తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో ఈటలను దోషిగా తేల్చారని... ఆయన ఆధీనంలోని అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చేయాలని సూచించారు. ఈటల రాజేందర్ బెదిరింపులకు ఎవరూ భయపడరని వెల్లడించారు. తెరాసలో ఉన్నందునే ఇన్నాళ్లూ ఈటలను గౌరవించామని తెలిపారు. దేవరయాంజల్ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు యత్నించారని... కరీంనగర్‌లో నేను గెలవకూడదని ఈటల శతవిధాలా ప్రయత్నించారని ఆరోపించారు.
ఇదీ చూడండి: అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల