వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర కార్పొరేషన్లలోనూ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో ఇతర పెద్దనగరాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు ఆలోచన ఉందా అంటూ.. ఎమ్మెల్యేలు బిగాల గణేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.
రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతిచ్చారని.. క్రమంగా విస్తరిస్తున్నామని ఈటల తెలిపారు. అర్బన్ పీహెచ్సీలు అందుబాటులోలేని ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని సభకు వివరించారు. వైద్యుడితో పాటు ఇద్దరు సిబ్బందితో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సేవలు అందిస్తున్నామని ఈటల తెలిపారు.
- ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 47 వేల మందికి వైరస్