ETV Bharat / state

ఛాతి ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల

కేరళలో మరో ఐదు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతి వైద్యశాలను ఆయన సందర్శించారు.

minister etela rajendar visit chest hospital
ఛాతి ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల
author img

By

Published : Mar 8, 2020, 7:13 PM IST

హైదరాబాద్​ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతి వైద్యశాలను మంత్రి ఈటల రాజేందర్​ సందర్శించారు. కరోనా రోగుల వైద్యం నిమిత్తం ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న ఐసొలేషన్ వార్డులను పరిశీలించారు. ప్రాంగణంలో వేరుగా ఉన్న భవనాన్ని వైరస్ లక్షణాలతో వస్తున్న వారికోసం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న నాలుగు వార్డుల్లో 56 పడకలను సిద్ధంగా ఉండగా... మరో నాలుగు ప్రత్యేక గదులను సిద్ధం చేయాలని సూచించారు.

జిల్లా కేంద్రాల్లోనూ ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రితో పాటు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఎండీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పాల్గొన్నారు.

ఛాతి ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల

ఇదీ చూడండి: హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.