రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి వ్యతిరేక నడకను చేశారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంకు మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
ఎయిడ్స్ వ్యాధిపై దేశవ్యాప్తంగా అవగాహన పెరిగిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో గతంలో 2 శాతం ఉన్న ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం 0.7 శాతానికి తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం : రేవంత్