హైదరాబాద్ కుత్బుల్లాపూర్ దత్తాత్రేయనగర్లో బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ రాజుతో కలసి మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. బస్తీ దవాఖానలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన నమూనాలను సేకరించి.. అందరికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీనిచారు. దవాఖానాలో మందుల కొరత ఉండబోదని.. నిత్యం తెరిచే ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే ఉన్న దవాఖానాలకు అదనంగా మరో 90 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యశాఖ మంత్రి ఈటల చెప్పారు.
![Minister etala inaugurates Basti Hospital in Dattatreya Nagar,Kutbhullapur Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-08-12-health-minister-basti-dawakhana-ab-ts10011_12112020094702_1211f_1605154622_794.jpg)
- ఇవీచూడండి: కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృతి