పల్లెప్రగతిలో భాగంగా డంప్యార్డుల నిర్మాణం, తడి-పొడిచెత్త నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. తడి, పొడి చెత్త సేకరణ సమయంలోనే వేరు కావాలని... అలా కాకపోతే డంప్ యార్డుల్లో కచ్చితంగా వేరు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సేంద్రీయ ఎరువుల తయారీని చేపట్టి ఆ ఎరువులతో బంగారు పంటలు పండించాలని ఎర్రబెల్లి తెలిపారు.
మార్గదర్శకాలను అనుసరించి తడి, పొడి చెత్త నిర్వహణతోపాటు సేంద్రీయ ఎరువులను తయారు చేయాలని సూచించారు. కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు తెలిపారు. సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. డంప్ యార్డుల చుట్టూ ఫెన్సింగ్ పొడవు పెరిగే మొక్కలను నాటాలని చెప్పారు. పచ్చదనం-పరిశుభ్రత ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని దయాకర్రావు అన్నారు. అధికారులు ఆ దిశగా పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
ఇదీ చూడండి : హరితహారం, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. సర్పంచ్ సస్పెన్షన్