ETV Bharat / state

పత్తి రైతులను ఆదుకోవాలని సీసీఐ ఎండీకి ఎర్రబెల్లి లేఖ

ప‌త్తి రైతుల‌ను ఆదుకోవాలని కోరుతూ సీసీఐ ఎండీకి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు లేఖ‌ రాశారు. ప‌త్తి కొనుగోలుకు ష‌ర‌తులు విధిస్తూ జీవో విడుద‌ల చేయడాన్ని ఆయన ఖండించారు. ఎలాంటి ష‌ర‌తులు లేకుండా రైతులు పండించిన ప‌త్తిని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు.

minister Errabelli dayakar rao letter to CCI MD to support cotton farmers
పత్తి రైతులను ఆదుకోవాలని సీసీఐ ఎండీకి ఎర్రబెల్లి లేఖ
author img

By

Published : Dec 6, 2020, 1:02 PM IST

షరతులు లేకుండా రైతులు పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు డిమాండ్‌ చేశారు. షరతులు విధిస్తూ సీసీఐ జీవో విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. పత్తి రైతులను ఆదుకోవాలని కోరుతూ సీసీఐ ఎండీకి ఎర్రబెల్లి లేఖ రాశారు. గిట్టుబాటు ధర అందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు.

ఇటీవల వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ప‌త్తి పంట రంగు మారి నాణ్యత తగ్గిందని... దిగుబ‌డి తీవ్రంగా తగ్గిపోయిందని వివరించారు. నిబంధల‌ు స‌డ‌లించి, ఎలాంటి ష‌ర‌తులు లేకుండా, సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. సీసీఐ జారీ చేసిన జీవోతో రైతుల్లో పత్తి సాగు చేయాలనే ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.