ETV Bharat / state

Palle pragathi: పదిరోజుల్లోగా పనులు పూర్తి కాకపోతే చర్యలే: మంత్రి ఎర్రబెల్లి - జులై ఒకటి నుంచి పల్లె ప్రగతి నాలుగో విడత

నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమానికి ప్రజలంతా పాటుపడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు కోరారు. రేపటి నుంచి పదిరోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. గ్రామాల్లో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి కాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

palle pragathi, minister errabelli dayakar rao
నాలుగో విడత పల్లె ప్రగతి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు
author img

By

Published : Jun 30, 2021, 8:47 PM IST

మూడు విడతల పల్లెప్రగతిని విజయవంతం చేసిన స్ఫూర్తితోనే నాలుగో దఫా కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఆయన వెల్లడించారు. ఇప్పటి దాకా పల్లెల అభివృద్ధి కోసం రూ.6,500 కోట్లు ఖర్చు చేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. రేపట్నుంచి పదిరోజుల పాటు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకోవాలని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నాలుగో విడత ప్రగతి కార్యక్రమాలపై అధికారులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమష్టిగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్​లో సన్నాహక సమావేశం నిర్వహించారు.

చర్యలు తీసుకుంటాం

పల్లె ప్రగతి పనులను సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు చేస్తారని ఎర్రబెల్లి అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రాత్రి బస చేయాలని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, ఇతర పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పది రోజుల తర్వాత పనులు పూర్తి కాని చోట ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'ప్రతి గ్రామపంచాయతీకి ఒక నోడల్​ ఆఫీసర్​ను నియమించాం. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను నోడల్​ ఆఫీసర్​గా ఉంటారు. ఒకటో తారీఖున గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలి. ఏ రోజు ఏం చేయాలో ప్రణాళిక తయారుచేసుకోవాలి. పూర్వ విద్యార్థుల సహకారంతో కూడా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి. ఈ పదిరోజులు నిరంతరంగా సమష్టి కృషి చేస్తూ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు పాటుపడాలన్నదే సీఎం కేసీఆర్​ ఆలోచన.'

-ఎర్రబెల్లి దయాకర్​ రావు, పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

ఆ వాడల్లో ప్రత్యేక దృష్టి

గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక చర్య తీసుకోవాలన్న మంత్రి... నోటీసులు జారీ చేశాక కూడా స్పందించకపోతే వాటిని గ్రామపంచాయతీలు స్వాధీనం చేసుకోవాలని అన్నారు. దళితవాడల్లో మౌలికసదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం ఆదేశించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తెలిపారు.

పదిరోజుల్లోగా పనులు పూర్తి కాకపోతే చర్యలే: మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చదవండి: Puvvada: ఎమ్మెల్యేతో కలిసి డప్పు కొట్టిన పువ్వాడ.. ఎందుకో తెలుసా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.