ETV Bharat / state

జానారెడ్డి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు: మంత్రి ఎర్రబెల్లి - జానారెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి విమర్శలు

మిషన్​ భగీరథ పథకంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఖండించారు. నల్గొండ జిల్లాకు గత మూడేళ్ల నుంచి మిషన్​ భగీరథ నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం కారణంగా పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. సీనియర్​ నాయకుడిగా ఉండి ఇలా మాట్లాడటం సరి కాదని హితవు పలికారు. హైదరాబాద్​లోని మంత్రుల నివాసంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.

minister errabelli
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు
author img

By

Published : Feb 13, 2021, 12:26 PM IST

Updated : Feb 13, 2021, 12:38 PM IST

రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి.. మిషన్​ భగీరథ పథకంపై శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో గడిచిన మూడేళ్ల నుంచి ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. జానారెడ్డి ఇంటికీ అందిస్తున్నామని.. సీనియర్ నాయకులుగా ఉండి అలా మాట్లాడటం తనకు బాధగా ఉందని వెల్లడించారు. రోడ్డు నిర్మాణం కారణంగా పట్టణంలో జానారెడ్డి ఇంటితో పాటు అందరి ఇళ్లకీ రెండు రోజుల నుంచి నీటి సరఫరా ఆగిపోయిందని వివరించారు.

అన్ని గ్రామాలకు అందిస్తాం..

రాజకీయ లబ్ధి కోసమే జానారెడ్డి.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఈ రోజు ఆయన ఇంటికి అధికారులను పంపుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తండాలు లాంటి 90 గ్రామాలకు మిషన్ భగీరథ రావడం లేదని.. త్వరలోనే వాటికి కూడా తాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

జానారెడ్డి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు: మంత్రి ఎర్రబెల్లి

సీఎంకు కానుక

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సీఎం పుట్టినరోజు కానుకగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. 'ఆకుపచ్చ తెలంగాణ' లక్ష్యంగా మొక్కలు నాటాలని సూచించారు. 2015 నుంచి ఇప్పటి వరకు అటవీ శాఖ లెక్కల ప్రకారం 4 శాతం పచ్చదనం పెరిగిందని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'అలా చేయకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోంచి తప్పుకుంటా'

Last Updated : Feb 13, 2021, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.