ETV Bharat / state

ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేసే ఆలోచనలో మోదీ సర్కారు: ఎర్రబెల్లి - Errabelli Unveiled MNREGA Calendar

Errabelli Criticism Of MNREGA Funds: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈజీఎస్​ ఉద్యోగుల క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసిన సీఎం కేసీఆర్​నే అని కొనియాడారు.

ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేసే ఆలోచనలో మోదీ సర్కారు: ఎర్రబెల్లి

author img

By

Published : Feb 2, 2023, 4:56 PM IST

Errabelli Unveiled Employment Guarantee Scheme Calendar: పేదలు, కూలీలకు ఉపాధి అందిస్తున్న ఉపాధిహామీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఉపాధిహామీ పథకం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. తెలంగాణ ఈజీఎస్ ఉద్యోగుల క్యాలెండర్​​ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కింద తెలంగాణ ప్రభుత్వమే అత్యంత ప్రజోపయోగ పనులు చేసిందన్న దయాకర్ రావు.. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్​ను కాపాడుకోవాలని కోరారు.

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉపాధిహామీ నిధులకు కోత పెడుతోందని.. నిన్నటి బడ్జెట్​లోనూ ఉపాధిహామీ నిధులను రూ.89వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లకు తగ్గించారని మంత్రి ఆరోపించారు. ఉపాధిహామీకి నిధుల తగ్గింపు పేదల, కూలీల వ్యతిరేక కేంద్ర విధానాలకు నిదర్శనమని అన్నారు. పనిదినాలు పెంచాలని కోరినా పెంచకుండా, నిధులు ఇవ్వకుండా కేంద్రం కూలీల పొట్టగొడుతోందని మంత్రి ఎర్రబెల్లి ఆక్షేపించారు.

  • మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేటికి సరిగ్గా 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు తెలంగాణ ఈజీఎస్ ఉద్యోగులతో కలిస్ కేక్ కట్ చేసి, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
    అనంతరం ఈజీఎస్ ఉద్యోగుల క్యాలెండర్ 2023ను ఆవిష్కరించడం జరిగింది. pic.twitter.com/oGvcu449Xe

    — Errabelli DayakarRao (@DayakarRao2019) February 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే ఆలోచనలో కేంద్రం: బడ్జెట్​లో ఉపాధిహామీ పథకం నిధులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు విమర్శలు గుప్పించారు. గతంలో రూ.89 వేల కోట్ల కేటాయింపులు ఉండేవని తెలిపారు. కానీ ఇప్పుడు రూ.60వేల కోట్లకు తగ్గించారని మంత్రి మండిపడ్డారు. ఈ పథకాన్ని మోదీ సర్కారు పూర్తిగా ఎత్తేసే ఆలోచనలో ఉందని ఆరోపణలు చేశారు. కేంద్రం వైఖరి వల్ల కూలీలు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఉపాధి హామీకి నిధుల కోతపై కూలీలు, ఫీల్డ్​ అసిస్టెంట్లు స్పందించాలని ఎర్రబెల్లి సూచించారు.

కేంద్ర బడ్జెట్​లో ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత: కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ భారతానికి ఆయువుపట్టుగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోతలు విధించింది. రైతులకు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలకు లబ్ధి చేకూర్చే ఉపాధిహామీ పథకానికి నిధుల్లో కోత విధించడం పట్ల రైతు సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఏకంగా రూ. 30 వేల కోట్ల నిధులు కోత విధించడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.

వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులకు ఆదాయాన్ని ఇస్తూ, ముఖ్యంగా కరోనా సమయంలో గ్రామీణ పేదల ప్రాణాలు కాపాడిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2022-23లో ఖర్చు రూ. 89 వేల 400 కోట్లు కేటాయించగా, 2023-24లో కేవలం రూ. 60 వేల కోట్లకు మాత్రమే కేటాయించారు. హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతామన్న ప్రకటన శుభపరిణామంగా భావిస్తున్నారు. గ్లోబల్‌ హబ్‌గా మార్చుతామని కేంద్రం తీపికబురు అందించండాన్ని సాగు నిపుణులు స్వాగతిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.