పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో 10 వేల మంది రోగులకు సరిపడా వసతి కల్పించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో అగ్నిమాపక ప్రమాణాలు మెరుగు పరుస్తున్నామన్నారు. నర్సులు, ఇతర సిబ్బంది కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు.
పీజీ విద్యార్థుల కోసం వసతి గృహాల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఆస్పత్రిలో కొన్ని చోట్ల గోడలు దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతులు చేయిస్తామన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్, డీఎం డా. రమేష్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఇవీ చూడండి: 'పేద విద్యార్థుల కోసమే కేజీ టు పీజీ విద్య'