కరోనా మరణాల్లో తెలంగాణ 12వ స్థానంలో ఉందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన వెంటనే... రాష్ట్రంలోని వైద్యశాఖ అప్రమత్తమైందని వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. మార్చి 14న సీఎం పాక్షిక లాక్డౌన్ ప్రకటించారని... నిత్యం కరోనా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కొవిడ్ రోగుల కోసం వేల పడకలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. వైరస్ సోకిన వారిని తరలించేందుకు అంబులెన్స్‌లు సిద్ధం చేశామన్నారు. కరోనా సోకిన 80 శాతం మందికి హోం ఐసోలేషన్ కిట్లు అందించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కరోనా నిర్ధరణ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశామని... ప్రస్తుతం రోజుకు 60 వేల కరోనా పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: 'రూ. 1000 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు'