ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గుల్బర్గా నుంచి వచ్చిన టోలీచౌకీకి చెందిన ముగ్గురికి కరోనా నెగెటివ్ వచ్చిందని చెప్పారు. 20 వేల మందికిపైగా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు. వారందరికీ కావాల్సిన సౌకర్యాలు సిద్ధం చేశామని తెలిపారు.
దూలపల్లి, వికారాబాద్‌లో క్వారంటైన్ సెంటర్‌లు నిండాయని మంత్రి చెప్పారు. విమానాశ్రయం నుంచి 40 బస్‌లతో క్వారంటైన్ సెంటర్‌లకు తరలిస్తున్నామన్నారు. ఆయా కేంద్రాల్లో, వైద్య, ఆహార సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. నిమ్స్, ఫీవర్, ఐపీఎం ఉస్మానియాలో లాబ్‌లు సిద్ధం చేశామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్