తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌పై మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. టిమ్స్‌లో సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు. జంట నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోవడంపై అధికారులతో చర్చించారు. కొన్ని ల్యాబ్‌ల్లో 70 శాతం నమూనాలు పాజిటివ్ రావడం అనుమానం కలిగిస్తోందని ఈటల అన్నారు. రెండు మూడ్రోజుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చిన ఫలితాల్లో కమిటీ నిజాలు తేల్చనుందని వెల్లడించారు.
అవకతవకలకు పాల్పడుతున్న ల్యాబ్‌లను మంత్రి ఈటల హెచ్చరించారు. సరిదిద్దుకొకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఇంటింటికి కరోనా సర్వే చేయనున్నట్లు ఈటల ప్రకటించారు.