కరోనాను కట్టడి చేయడంలో భాగంగా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆవరణలో ప్రారంభించిన ఈ సంచార వాహనాలు గురువారం నుంచి అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే 1,100 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని వాటికి అదనంగా ఈ ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనలైసిస్ సర్వీసెస్ మొబైల్ ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ల్యాబుల్లో ఒకేసారి 10మందికి కరోనా పరీక్షలు, శాంపిల్స్ సేకరణ చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.
5 శాతం మందికే ఐసోలేషన్ ఆక్సిజన్ అవసరం
కరోనా కాలంలో వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి, వైద్యులకు వెన్నుదన్నుగా ఉండాలన్నారు. కరోనా పాజిటివ్‌గా వచ్చి లక్షణాలు లేనివాళ్లు 80నుంచి 81శాతం మంది ఉన్నారని మంత్రి వివరించారు. మిగిలిన 19శాతంలో 14శాతం మందికి ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. మిగిలిన 5శాతం మందికే నిరంతరం వైద్యుల పర్యవేక్షణ ఐసోలేషన్ ఆక్సిజన్ అవసరం అవుతుందని మంత్రి తెలిపారు.
ఇది చదవండి: ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక