రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత ఆదివారం నాడు పరీక్షలు చేయించుకోగా మల్లారెడ్డికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందారు.
ప్రస్తుతం మల్లారెడ్డి వైద్య కళాశాలలో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి లక్షణాలు లేవని ఆయన పేర్కొన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ.. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చునని పేర్కొంటూ మంత్రి మల్లారెడ్డి వీడియోను విడుదల చేశారు.
ఇదీ చూడండి : 'ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'