ETV Bharat / state

అప్పు ఎక్కువైనా పేదలను ఆదుకుంటాం: బుగ్గన రాజేంద్రనాథ్​ - ఏపీ ఆర్థిక పరిస్థితి

పేద, మధ్య తరగతి వారిని ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చిందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్​ నేపథ్యంలో అప్పు కాస్త ఎక్కువైనప్పటికీ.. ఆ వర్గాలను ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచించిందని స్పష్టం చేశారు.

buggana rajendra nath
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
author img

By

Published : Mar 5, 2021, 5:50 PM IST

బడ్జెట్‌ అంచనాల కంటే ఎక్కువ మొత్తమే అప్పులు చేశామని ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. రుణాలు తీసుకోవడం విపరీతమైన పొరపాటు కాదని వ్యాఖ్యానించారు. పేద, మధ్య తరగతి వారిని ఆదుకునేందుకు అప్పు ఎక్కువ చేసినా ఫర్వాలేదని.. కానీ ఆ వర్గాలను ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచించిందని స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో పథకాలను ఎత్తివేసినప్పటికీ... ఇక్కడ మాత్రం అలాగే నడిపిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ఒక్క ఏపీనే కాదు.. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అప్పుల్లో ఉందని వివరించారు.

చర్చకు సిద్ధం...

కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన మండిపడ్డారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వందేళ్ల నుంచి తమ కుటుంబం మైనింగ్‌ రంగంలో ఉందన్న ఆయన... తానిప్పటికీ పాత కారే వాడుతున్నానని చెప్పారు.

అప్పు ఎక్కువైనా పేదలను ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి బుగ్గన

'కర్నూలుకు మేం ఏం చేయలేదని చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల తెదేపా పాలనలో మీరేం చేశారు. కర్నూలులో హైకోర్టు పెడతామని మా సీఎం ధైర్యంగా చెప్పారు. ఓర్వకల్లులో అద్భుతమైన విమానాశ్రయం నిర్మించబోతున్నాం. తుంగభద్ర పుష్కరాల్లో అవినీతి లేకుండా రూ. 200 కోట్లు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించాం. మైనింగ్​లో అక్రమం చేశానని చంద్రబాబు అన్నారు. 1918లోనే మా ముత్తాత మొదటిసారిగా మైనింగ్ చేశారనే విషయం తెలుసుకోవాలి. నాలుగు తరాల నుంచి మేం అదే చేస్తున్నాం. అయినప్పటికీ నేను పాత కారులోనే తిరుగుతున్నాను. అపార్ట్ మెంట్​లోనే ఉంటున్నాను. రెండు ఎకరాల నుంచి వచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు.'

- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి

ఇదీ చదవండి: మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి ఏమైనా చేస్తాడు: రఘునందన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.