తెలంగాణ అడవులు ప్రత్యేకమైనవని.. అనేక వృక్షజాతులకు తోడు విభిన్న జంతుజాలానికి రాష్ట్ర అడవులు పేరు పొందాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరుద్ధరణ చర్యల వల్లే అడవుల్లో పర్యావరణం, జంతుజాలం బాగా వృద్ధి చెందిందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ అడవుల్లో కనిపించే విభిన్న జంతు జాతులపై సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పుస్తకాన్ని అరణ్య భవన్‌లో మంత్రి ఆవిష్కరించారు.
తెలంగాణలో మొత్తం 2,450 రకాల జంతువులు, పక్షులు, పాములు, కీటకాల జాతులను గుర్తించినట్లు కార్యక్రమంలో పాల్గొన్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచాలకులు డాక్టర్ కైలాష్ చంద్ర తెలిపారు. 1,744 వెన్నెముక లేని జంతువులు, 706 వెన్నెముకతో కూడిన జంతువులు, కేవలం ఈ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే 82 రకాల జంతువులను అడవుల్లో గుర్తించినట్టు వివరించారు. భవిష్యత్తులో ప్రాంతాల వారీగా సర్వే చేసి, ప్రత్యేక పుస్తకాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: పర్యావరణాన్ని కాపాడుకోకపోతే గాలి, నీరు దొరకదు: ఇంద్రకరణ్