మెట్రో రైల్లో హైటెక్ సిటీ వరకు ప్రయాణించే ప్రయాణికులకు మరింతగా ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైటెక్ సిటీ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు రివర్సల్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రివర్సల్ సిస్టమ్ అందుబాటులోకి రావడం వల్ల రద్దీ సమయాల్లో అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు 4నిమిషాలకు ఒక మెట్రో రైల్‌ను నడుపుతామని ఎండీ ప్రకటించారు. ఇది ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హైటెక్ సిటీ - అమీర్‌పేట కారిడార్‌లో రెండు నుంచి మూడు వారాల వరకు 4నిమిషాలకు ఒక రైలు నడుపుతామని...తర్వాత పరిస్థితిని బట్టి 3నిమిషాలకు కుదిస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఏసీ టెంపరేచర్‌ని 23 డిగ్రీలకు తగ్గించినట్లు పేర్కొన్నారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లో 5 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: మెట్రో రైలులో పాము.. 2,500 కి.మీ ప్రయాణం