మెట్రోలో కీలకమైన ఎయిర్ పోర్ట్ కారిడార్ పనులు త్వరలో చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి మైండ్ స్పేస్ స్టేషన్ కూడా అందుబాటులోకి తీసుకోస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. హైటెక్ సిటీ-జూబ్లీహిల్స్ మార్గంలో రెండో ట్రాక్ కోసం తుది అనుమతులు త్వరలో రానున్నట్లు తెలిపారు.
రోజుకు 2లక్షల 80వేల మంది ప్రయాణం...
ప్రస్తుతం హైటెక్ సిటీ - అమీర్ పేట్ మధ్య ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. కార్యాలయాల సమయాల్లో ఇదీ మరింత పెరుగుతోంది. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్‌కు ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఈ వర్షకాలంలో భారీగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు సరాసరిగా 2 లక్షల 80 వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.
మైండ్ స్పేస్ మెట్రో స్టేషన్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. ఇదీ ప్రారంభమైతే రోజుకు సరాసరి 3 లక్షల 50 వేల వరకు ప్రయాణికుల సంఖ్య చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీచూడండి: 'తెలంగాణలో భాజపాను బలోపేతం చేయడమే ధ్యేయం'