భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షం నీటితో రహదారులు జలమయమయ్యాయి. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. వర్షం కారణంగా మెట్రో రైళ్లును అధికారులు నిలిపివేశారు.
ఇదీ చూడండి: ఒక్కసారిగా వాన.. నిండుకుండలా భాగ్యనగరం