ETV Bharat / state

మీ స్వీట్‌హార్ట్‌తో గొడవైందా, నో ప్రాబ్లం ఈ ఒక్క మెసేజ్‌తో కూల్‌ చేసేయండి - relationship tips latest

పెళ్లైన కొత్తలో ఆలుమగల జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. అయితే రోజులు గడిచేకొద్దీ చాలా జంటల్లో గొడవలు, మనస్పర్థలు రావడం సహజమే అయినా.. ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోయే వారు కొందరుంటే.. మరికొందరు వీటిని భూతద్దంలో పెట్టి మరీ చూస్తుంటారు. ఫలితంగా చిన్న సమస్య కాస్తా పెద్దదవుతుంది. అయితే సంసార బంధాన్ని ఇలా తెగే దాకా లాగడం కంటే.. చిన్న చిన్న సందేశాలతో తిరిగి దృఢం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆలుమగల మధ్య గొడవ జరిగినప్పుడు.. ఆ దూరాన్ని దగ్గర చేసుకునేందుకు జంటలు పంపుకొనే కొన్ని సందేశాలేంటో చూద్దాం..!

WAYS TO COOL YOUR PARTNER AFTER QUARREL
మీ స్వీట్‌హార్ట్‌తో గొడవైందా, నో ప్రాబ్లం ఈ ఒక్క మెసేజ్‌తో కూల్‌ చేసేయండి
author img

By

Published : Aug 26, 2022, 6:13 AM IST

Updated : Aug 26, 2022, 6:40 AM IST

❤ నా మాటలు, చేతలు నిన్నెంతో బాధించాయని నాకు అర్థమవుతుంది. నువ్వు దూరమయ్యాకే నీ విలువ తెలిసొచ్చింది. గడిచిన విలువైన సమయాన్ని తిరిగి తీసుకురాలేను.. కానీ జరిగిన పొరపాటును సరిదిద్దుకోగలనని భావిస్తున్నా. ప్లీజ్‌.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వవూ..!!

...

❤ మనకు సంబంధించిన కొన్ని విషయాల్లో నేను నీకు తగిన ప్రాధాన్యమివ్వలేకపోయా. ఈ విషయం ఆలస్యంగానైనా తెలుసుకోగలిగా. ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తపడతా.

❤ మన ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు రావడానికి నువ్వు నా విషయంలో చెప్పే కారణాలన్నీ సరైనవే! నా స్వార్థ బుద్ధితోనే నేను నిన్ను దూరం చేసుకున్నా. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేశా. కానీ, ప్రేమలో స్వార్థం ఉండకూడదని నువ్వు దూరమయ్యాక గానీ తెలుసుకోలేకపోయా. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయా. ఈ ఒక్కసారికీ నన్ను క్షమించు డియర్‌!

❤ ఆ రోజు నిన్ను చాలా బాధపెట్టాను. నువ్వు మంచి మాటలు చెబుతున్నా వినిపించుకునే స్థితిలో అప్పుడు నేను లేను. అలా నా ప్రవర్తనతో నిన్ను నేను హర్ట్‌ చేయాల్సింది కాదు. కానీ నేను చేసిన తప్పుకు ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నా.. సారీ!

....

❤ తప్పు జరిగిన ప్రతీసారి నీవల్లే అన్నట్లు ప్రవర్తించా. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నిన్ను బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. కొన్ని సందర్భాల్లో నేనూ తీవ్ర మనోవేదనకు గురయ్యా. ఈ విషయం నీతో చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. కానీ, ఇప్పుడు నువ్వు అనుమతిస్తే ప్రతి విషయం నీతో చర్చించడానికి, పొరపాటైతే క్షమాపణ కోరడానికి నేను సిద్ధంగా ఉన్నా.

❤ గతంలో నీ దగ్గర చాలా విషయాలు దాచాను. దానికి కారణం వాటిని నువ్వు అర్థం చేసుకోలేవేమోనన్న భయం! నిజానికి తప్పు నాదే. భార్యాభర్తల మధ్య ఎంత పారదర్శకత ఉంటే అంత మంచిదని ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు నాకు మరొక్క అవకాశం ఇస్తే ఎలాంటి దాపరికం లేకుండా అన్ని విషయాలు నీతో పంచుకుంటాను.

....

❤ మన మధ్య గొడవై.. సమస్య పరిష్కారం కోసం నువ్వు నాతో మాట్లాడినప్పుడు.. నేను మరింత ఓపెన్‌గా మాట్లాడాల్సింది. నా విషయాలను నీకు మరింత స్పష్టంగా చెప్పాల్సింది. కానీ నేను అలా చేయలేదు. ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు.. ఇద్దరం కలిసి మన అభిప్రాయాలను పంచుకుందాం.. మన మధ్య ఏర్పడిన అగాథాన్ని పూడ్చుకుందాం..!

❤ గతంలో నాలో ఉన్న అభద్రతా భావం వల్ల నిన్ను చాలా ఇబ్బందిపెట్టాను. జరిగిన వాటిని మార్చలేం. కానీ, ఇప్పుడు ఆ ఆలోచనల్ని పక్కన పెట్టి నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను.. నాలో నీకు నచ్చని విషయాల్ని మార్చుకుంటాననీ మాటిస్తున్నా.

దాంపత్య బంధమంటేనే శాశ్వతమైంది. ఇలాంటి పవిత్రమైన అనుబంధాన్ని లేనిపోని గొడవలతో చిన్నబుచ్చుకోకుండా.. మీలోని పశ్చాత్తాప భావనను ఇలా సందేశాత్మకంగా మీ భాగస్వామికి చేరవేయండి. తప్పకుండా మీ సమస్యకో పరిష్కారం దొరుకుతుంది.. మీ మధ్య అనుబంధమూ తిరిగి దృఢమవుతుంది.

ఇవీ చూడండి..

Last Updated : Aug 26, 2022, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.