ETV Bharat / state

Merchants worry about GST Hike: వస్త్రవ్యాపారంపై జీఎస్టీ పిడుగు.. ఆందోళనలో వ్యాాపారులు! - తెలంగాణ వార్తలు

Merchants worry about GST Hike : దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమపై జనవరి నుంచి జీఎస్టీ పిడుగు పడనుంది. పన్ను 5 శాతం నుంచి 12శాతానికి పెరగడం వ్యాపార వర్గాన్ని కలవరానికి గురిచేస్తోంది. అప్పులపై ఆధారపడి జరిగే ఈ వ్యాపారంపై జీఎస్టీ పెంపు గొడ్డలి పెట్టులాంటిదని వస్త్రవ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కొవిడ్‌తో కుదేలై... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమపై ఈ నిర్ణయంతో మోయలేని భారం పడనుందని వాపోతున్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Merchants worry about GST Hike, GST Increase on textile industry
వస్త్రవ్యాపారంపై జీఎస్టీ పెంపు పిడుగు
author img

By

Published : Dec 21, 2021, 8:54 PM IST

Merchants worry about GST Hike : దేశంలో వ్యవసాయం రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ. ఈ ఏడాది అక్టోబరు నాటికి దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమ ద్వారా నాలుగున్నర కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా. ఇందులో చేనేత రంగం ద్వారా 35.22 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరపు లెక్కల ప్రకారం... ఉత్పత్తిలో చేనేత పరిశ్రమది ఏడు శాతం ఉండగా... జీడీపీలో 2శాతం ఉంది. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా తీవ్ర ఒడుదొడుకులకులోనైన వస్త్రపరిశ్రమ... ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12శాతానికి పెంచడం వస్త్రవ్యాపారులకు గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది.

వస్త్రవ్యాపారం కుదేలు

GST Increase on textile industry : నిత్యావసరాల్లో ఒకటైన వస్త్రంపై పన్ను తగ్గించాల్సిందిపోయి... పెంచడం ఏంటని వ్యాపార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే పన్నే అయినప్పటికీ... వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పెంచిన జీఎస్టీని తగ్గించాలని వ్యాపార వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అప్పులపై ఆధారపడి జరిగే వస్త్ర వ్యాపారం కుదేలవుతుందని... ఆర్థిక స్థోమత తక్కువ ఉన్న వారంతా రోడ్డున పడతారని టెక్స్‌టైల్‌ వ్యాపారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

తొలుత వ్యతిరేకత

problems of textile merchants : దేశ చరిత్రలో చేనేత ఉత్పత్తులపై పన్ను విధింపు ఉండేది కాదు. ప్రవేశ రుసుము విధించగా ఆందోళనలు వ్యక్తం కావడంతో... కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత వ్యాట్ విధిస్తే కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో దానిని కూడా వెనక్కి తీసుకున్నారు. అయితే 2017 మేలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వస్త్ర పరిశ్రమను జీఎస్టీ నుంచి మినహాయించాలన్న చర్చ వచ్చినప్పటికీ ఎక్కువ రాష్ట్రాలు అడ్డుపడడంతో ఆ ప్రతిపాదన అంతటితో ఆగిపోయింది. పెట్రోల్‌, డీజిల్‌, లిక్కర్‌ లాంటివి కొన్నింటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీ మొదటి సారిగా వస్త్ర పరిశ్రమకు వర్తింపజేసింది. వస్త్రాలు తయారు చేసేందుకు అవసరమైన ముడిసరుకుపై 5శాతం నుంచి 18శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు. తయారైన వస్త్రాలపై మాత్రం 5శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. కొనుగోలుదారుల నుంచి వచ్చే 5శాతం మాత్రం తయారీదారులకు జమవుతోంది. మిగిలినది ఐటీసీ ద్వారా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి వస్తోంది.

జనవరి నుంచి అమల్లోకి..

2018-19 ఆర్థిక ఏడాదిలో టెక్స్‌టైల్‌ రంగానికి ఐటీసీ ద్వారా రూ.6000 కోట్లు రీఫండ్‌ ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల పలుమార్లు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో పన్ను విధింపుపై సుదీర్ఘంగా చర్చించారు. వస్త్రపరిశ్రమపై ఫిట్‌మెంట్‌ కమిటీని వేసిన కౌన్సిల్‌... ప్రతిపాదనలు తెప్పించింది. ఈ ఏడాది సెప్టెంబరులో లక్నోలో జరిగిన 45వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వస్త్రపరిశ్రమపై 5శాతం నుంచి 12శాతానికి పెంచాలని, దానిని వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

వస్త్రవ్యాపారం కనుమరుగయ్యే అవకాశం

2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడ్డాయి. తాజా గణాంకాల మేరకు ఆ సంఖ్య 30.44 లక్షల కుటుంబాలకు పడిపోయింది. అంటే దాదాపు 25% కుటుంబాలు చేనేత పరిశ్రమకు దూరమయ్యాయి. గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగాన్ని ఒక పరిశ్రమగా కాకుండా... గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత రంగంలో తక్కువ ఆదాయం, క్లిష్టమైన పరిశ్రమ కావడంతో కొత్త జనరేషన్ ఈ రంగానికి దూరమవుతోంది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే చేనేత రంగం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో ఈ రంగంలో పనిచేస్తున్న 67శాతం కుటుంబాల ఆదాయం రూ.5వేల కంటే తక్కువగా ఉందని, మరో 26 శాతం మంది కుటుంబాల ఆదాయం రూ.10వేల కంటే తక్కువని అంచనా.మొత్తం 93 శాతం చేనేత కుటుంబాల ఆదాయం పదివేలకు మించడం లేదన్నది తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి.

వ్యాపారుల్లో ఆందోళన

సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో వరుస పండుగల కారణంగా వస్త్రవ్యాపారం భారీగా జరుగుతుంది. కొత్త కొత్త డిజైన్ల బట్టల మార్కెట్​పై దృష్టిసారించిన వ్యాపారులు... జనవరి నుంచి పెరిగిన జీఎస్టీ అమల్లోకి వస్తుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తయారీ దారుల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులు మూడు నెలలు అప్పుగా సరుకు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి సెమీ హోల్‌సేల్‌, రీటైలర్లకు ఆరు నెలల అప్పుతో సరుకు ఇస్తారు. కానీ జీఎస్టీ వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఆ నెలలో జరిగిన వ్యాపారానికి రిటర్న్‌లు, 5శాతం జీఎస్టీని చెల్లిస్తూ వస్తున్నారు. రూ.20లక్షల వార్షిక వ్యాపారం దాటిన వ్యాపారులు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల రిటర్న్‌లు వేయడం కొంత ఇబ్బంది కావడంతో... కొందరు ఈ వ్యాపారం నుంచి దూరమయ్యారని వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా పన్ను మరో ఏడు శాతం అదనపు పెంపుతో... మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయారు.

ఆన్​లైన్​పై ఎక్కువ ఆసక్తి

వస్త్ర పరిశ్రమపై వేస్తున్న జీఎస్టీ ప్రతిపైసా కొనుగోలుదారులే చెల్లిస్తారు. ఇప్పుడున్న 5శాతం, జనవరి నుంచి అమల్లోకి రానున్న 12శాతమైనా వ్యాపారులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ పన్ను పెరుగుదలపై వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. కొవిడ్‌ ప్రభావంతో... అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ వ్యాపారం ఊపందుకుంది. జనాలు కూడా బిజీగా ఉండడం వల్ల... ఆన్​లైన్ వ్యాపారంవైపే మొగ్గు చూపుతున్నారు. సరసమైన ధరలకే ఇంటికే కావల్సిన బట్టలు వస్తుండడంతో... దుకాణాల్లో షాపింగ్‌ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.

మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

జనవరి ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ఇప్పుడున్న 5శాతంపైనే తీవ్ర వ్యతిరేకత ఉండగా.... తిరిగి మరో ఏడు శాతం పెంచడంతో చేనేత రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.20 లక్షల వార్షిక ఆదాయాన్ని రూ.50 లక్షల వరకు పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ పెంపు పట్ల వ్యాపార సంఘాలు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం దీనిని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

వస్త్రవ్యాపారంపై జీఎస్టీ పెంపు పిడుగు

ఇదీ చదవండి: మంచానికే పరిమతమైన యువకుడు.. సాయం కోసం ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.