memorial salute to the heroes of the Indian Navy: ఏపీలోని విశాఖ సాగర తీరంలో విజయ్ దివస్‌ను తూర్పు నౌకాదళం ఘనంగా నిర్వహించింది. భారత్ 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో సాధించిన విజయాన్ని గుర్తుగా ఈ విజయ్ దివస్‌ను జరుపుకోవడం ఆనవాయితీ. నౌకాదళం సాధించిన విజయానికి కారకులై యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావెల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీ కుమార్ నాయర్ హాజరై విక్టరీ ఎట్ సీ వద్ద పుష్పగుచ్ఛాలను సమర్పించి మౌనం పాటించారు.
భారత్ 1971లో పాకిస్తాన్ పై యుద్ధంలో విజయానికినౌక దళం ప్రధాన భూమిక పోషించింది. దీనికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ రోజున త్రివిధ దళాలు ఆయాచోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తాయి. భారత నౌకాదళ వీరులకు స్మారక వందనాన్ని నౌకాదళ సిబ్బంది సమర్పించారు. విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళం సిబ్బంది హాజరయ్యారు.
ఇవీ చదవండి: