కొవిడ్ సహాయక చర్యల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద... మేఘా ఇంజినీరింగ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి... 11 క్రయోజనిక్ ట్యాంకర్లను అందించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకాక్ నుంచి యుద్ధవిమానం ద్వారా చేరుకున్న మూడు ట్యాంకర్లు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆక్సిజన్ తీసుకొచ్చేందుకు వీలుగా రైలుమార్గంలో ఒడిశా వెళ్లేందుకు ఆ ట్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
మొదటి దశలో భాగంగా మూడు ట్యాంకర్లు హైదరాబాద్ చేరుకున్నాయన్న సీఎస్ సోమేశ్ కుమార్ మిగతా ట్యాంకర్లు మూడు, నాలుగు రోజుల్లో ఆ సంస్థ అందింస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామన్న సీఎస్.. వైరస్ కట్టడికి అధికారులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రోగులకు ప్రాణవాయువు సరఫరా కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించామని, ట్యాంకర్లు కూడా సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెయిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ