ETV Bharat / state

నేడు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ

ఇవాళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ జరగనుంది. హైదరాబాద్ బస్​భవన్​లో సమావేశంకానున్నారు. అధికారుల సమావేశం కొలిక్కివస్తే... ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల మధ్య సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది.

నేడు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ
నేడు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ
author img

By

Published : Sep 15, 2020, 4:56 AM IST

నేడు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు హైదరాబాద్​లోని బస్ భవన్​లో మరోమారు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఏపీ 2.64 లక్షల కి.మీలు మేర బస్సులను తిప్పుతోంది. ఏపీలో తెలంగాణ 1.52 లక్షల కి.మీ.లు తిప్పుతోంది. రాష్ట్రం కంటే ఏపీ అదనంగా 1.12 లక్షల కి.మీలు బస్సులను తిప్పుతోంది.

గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమీక్షా సమావేశంలో అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల నిర్వహణలో సమన్యాయం పాటించాలని సూచించారు. ఏపీ ఎన్ని కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో తిప్పితే... అన్ని కి.మీ.లు తెలంగాణ బస్సులు ఏపీ భూభాగంలో తిప్పాలి. కానీ... ఇంతకు ముందు రెండుసార్లు జరిగిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ఈ అంశం కొలిక్కి రాలేదు.

గతంలో ఏపీలో, ఇటీవల హైదరాబాద్​లో, మళ్లీ నేడు తాజాగా ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కావాలని నిర్ణయించగా... సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీని లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరారు. 55 కి.మీ.లకు మించి తగ్గించుకోమని ఏపీ అధికారులు చెప్పారు. అధికారుల సమావేశం కొలిక్కివస్తేనే... ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల మధ్య సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: రైతుబంధు నివేదిక విడుదల చేసిన వ్యవసాయ శాఖ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.