ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. మైహార్ట్, యువర్హార్ట్, అవర్హార్ట్.. బీ ఏ హార్ట్ హీరో అనే నినాదంతో నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీని నిర్వహించింది. సైకిలింగ్ గుండెకు ఆరోగ్యకరమని సందేశం ఇస్తూ కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కేబీఆర్ పార్క్ నుంచి ఆరు కిలోమీటర్ల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భారీగా ఔత్సాహికులు పాల్గొన్నారు. గుండెకు సంబంధించిన రోగాలు అన్ని వయసుల వారికి వస్తున్నాయని.. ఒత్తిడి తగ్గించుకుని జీవిస్తూ.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఈటల సూచించారు.
ఇదీ చూడండి :'నవరాత్రుల్లో రెండోరోజు ఈ మంత్రం జపిస్తే.. ఆర్థిక ఇబ్బందులు ఉండవు'