ETV Bharat / state

High court: కరోనా కట్టడిపై హైకోర్టుకు వైద్యారోగ్య శాఖ నివేదికలు - dmho affidavits to ts high court

రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 50 లక్షలకు పైగా టీకాల పంపిణీ పూర్తి చేసినట్లు హైకోర్టుకు డీహెచ్​ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ 75 శాతం పూర్తిచేసినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు, చికిత్స, కేసులపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హైకోర్టుకు నివేదికలు సమర్పించారు.

dmho report to high court
హైకోర్టుకు వైద్యారోగ్య శాఖ నివేదిక
author img

By

Published : Aug 11, 2021, 6:16 PM IST

కొవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సహా పోస్ట్ కొవిడ్ కేసుల నిర్వహణ, చికిత్సకు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి.. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు డీహెచ్, డీఎంఈ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శులు విడివిడిగా కోర్టుకు నివేదికలు సమర్పించారు. వ్యాక్సినేషన్, కొవిడ్ కట్టడిపై కోర్టుకు నివేదించిన డీహెచ్ శ్రీనివాస రావు.. జులై 4 నుంచి ఆగస్టు 8 వరకు రోజుకి సరాసరి 1,15,986 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివిటీ కేవలం 0.5 శాతంగా ఉందని కోర్టుకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 428 ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక బిల్లులపై ఇప్పటి వరకు 756 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. అందులో 74 ఫిర్యాదులను పరిష్కరించి.. బాధితులకు రూ. 1,36,63,740 తిరిగి చెల్లించినట్లు కోర్టుకు నివేదించారు.

వారికి టీకాలు

ఇప్పటి వరకు మొత్తం 1,54,82,496 డోసుల టీకాలను పంపిణీ చేశామని తెలిపిన డీహెచ్.. ఖైదీలు, సాధువులు, యాచకులు, మానసిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించినట్టు న్యాయస్థానానికి వివరించారు. ఖైదీలు, ఓల్డెజ్ హోంలలో ఇప్పటి వరకు 2921 మందికి టీకాలు అందించామని చెప్పారు. మానసిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలోనూ 407 మందికి టీకాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. జూన్​లో 1,41,697 మంది పాఠశాలల సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. డీపీహెచ్, డీఎంఈ, టీవీవీపీల్లో, ఆస్పత్రుల్లో కలిపి ఖాళీగా ఉన్న 3,311 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి.. 2,418 మందిని రెగ్యులర్ పద్ధతిలో విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. అర్హులైన వారు అందుబాటులో లేకపోవటం వల్ల మరో 893 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.

ఖాళీల భర్తీపై

ఇక పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న వారి చికిత్స కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి డీఎంఈ రమేష్ రెడ్డి కోర్టుకు విడిగా నివేదిక సమర్పించారు. కరోనా తగ్గిన తర్వాత ఇతరత్రా అనారోగ్యాల బారిన పడుతున్న వారి కోసం బోధనాస్పత్రులతోపాటు... టీవీవీపీ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందిస్తున్నట్లు రమేష్​ రెడ్డి వివరించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి.. ఆ శాఖ సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శేషాద్రి కోర్టుకు నివేదిక అందించారు. ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ సర్జన్, ట్యూటర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్టాఫ్ నర్సులు సహా ఖాళీగా ఉన్న పోస్టులను ఇప్పటికే గుర్తించిందని ... వాటిని పూరించేందుకు నిర్ణయించినట్టు వివరించారు.

ఇదీ చదవండి: Harish rao: 'ఈటలను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేస్తే... మోసం చేశాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.