ETV Bharat / state

ఉన్నవి ఉపయోగించరు.. కొత్తవాటికి అనుమతివ్వరు!

రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకు పెరుగుతుంటే.. ప్రభుత్వం, అధికారులు మాత్రం.. అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కేసులు పెరుగుతూ.. పరీక్షలు చేయాల్సిన అవసరం పెరుగుతుంటే.. పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచకుండా వైద్య ఆరోగ్య శాఖ జాప్యం చేస్తున్నది.

Mediacal And Health Department Not Using Proper Corona Test Centers
ఉన్నవి ఉపయోగించరు.. కొత్తవాటికి అనుమతివ్వరు!
author img

By

Published : Jun 26, 2020, 9:48 AM IST

అటు రాష్ట్రంలో.. ఇటు రాజధానిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ కరోనా పరీక్షల కేంద్రాల సంఖ్యను రెండింతలు పెంచాలి. కానీ ఈ విషయంలో వైద్యశాఖ తక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్య రోజురోజుకు పెరుగుతున్నది. పెద్దఎత్తున పరీక్షలను చేయడానికి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంతోపాటు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ వీటిలో పరీక్షలు చేయడానికి అధికారులు అనుమతివ్వడం లేదు. ఫలితంగా పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య అధికమై.. పాజిటివ్​ కేసులు పెరిగి.. ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. ఈ ఆలస్యం కారణంగా పాటిజివ్​ వ్యక్తుల వల్ల మరింత మందికి వ్యాధి సోకుతుంది. అయినా.. అధికారులు చర్యలు వేగవంతం చేయకపోవడం చూస్తుంచే.. ప్రజారోగ్యం పట్ల ప్రభుతానికున్న నిర్లక్ష్యం బట్టబయలవుతుంది.

కేసులున్నా.. పరీక్షా కేంద్రాల్లేవ్!

రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకంటే రాజధాని పరిధిలోని జిల్లాల్లో అధికంగా కరోనా విస్తరిస్తోందని ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రహించారు. దీన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేయాలని రాజధాని జిల్లాల్లో 50 వేల కరోనా పరీక్షలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. అయితే అధికారులు ప్రణాళికతో ముందుకు వెళితే నగరంలో వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట పడేది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 3 వేలు, ఆపైన పరీక్షలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వారంరోజులుగా రోజుకు 600 నుంచి 700 వరకు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా పరీక్షల కేంద్రాలకు నిత్యం వేలాదిమంది పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. కొంతమంది ప్రైవేటు పరీక్షల కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే కిట్స్‌ అయిపోయాయని, ఆరోజుకు చేయాల్సినవి పూర్తయిందనో కారణం చూపి పరీక్షలను ఆపేస్తున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చిన వందలాదిమంది వెనుతిరుగుతున్నారు. గాంధీతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పరీక్షల ల్యాబ్‌లు ఏరోజుకారోజు ఫలితాలను వెల్లడించలేకపోతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా వైద్య శాఖ స్పందించి పరీక్షలు చేసే సౌకర్యాలున్న కేంద్రాలకు అనుమతిచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదంటున్నారు.

ఇవి సిద్ధం.. కానీ ఉపయోగించుకోరూ..

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం రెండున్నర నెలల కిందటే కరోనా టెస్టులు చేయడానికి ముందుకు వచ్చింది. దీనికి అనుగుణంగా అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే రోజుకు వెయ్యి పరీక్షలు చేయడానికి తాము సిద్ధమని నెలన్నర కిందటే వర్శిటీ వీసీ డాక్టర్‌ అప్పారావు ప్రకటించారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ఈ వర్సిటీకి అనుమతివ్వలేదు. ఐఐసీటీ కూడా ఈ పరీక్షలు చేయడానికి మొదట్లోనే సిద్ధమైంది. తమకు కొన్ని సౌకర్యాలను కల్పించాలని కోరుతోంది. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ చొరవ చూపితే ఇప్పటికే కరోనాపై వివిధ రకాల పరిశోధనలు చేస్తున్న ఐఐసీటీలో కూడా కరోనా పరీక్షలు మొదలయ్యేవి. కరోనా పరీక్షల నిర్వహణ కోసం ఈఎస్‌ఐలో మొబైల్‌ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 800 నుంచి 2 వేల వరకు పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ ఈఎస్‌ఐ కార్డు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేసి సరిపెడుతున్నారు. ఈ కేంద్రాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉంటుందనేది నిపుణుల వాదన.

నిమ్స్‌లో తక్కువ పరీక్షలు చేస్తున్నారు. ఈ ల్యాబ్‌ను కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్ఛు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ పరీక్షలు చేయొచ్చు. ఇప్పటికైనా ఉన్న ల్యాబుల్లో పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి, కొత్తవాటిలోనూ పరీక్షలు చేసి మరునాడే ఫలితాలు వెల్లడిస్తే పరిస్థితి చేయి దాటకుండా ఆపొచ్చు.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.