ETV Bharat / state

కిలో మటన్​ రూ. 800.. చికెన్​ రూ.180 - latest news on meat prices are Rising in hyderabad kilo mutton rs.800

కరోనా భయంతో మొన్నటి వరకు కొనుగోలుదారులు లేక వెలవెలబోయిన మాంసం దుకాణాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. మాంసం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతుండడం వల్ల దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఫలితంగా కొనుగోలుదారులతో మాంసం దుకాణాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

meat prices are Rising in hyderabad kilo mutton rs.800
కిలో మటన్​ రూ. 800.. చికెన్​ రూ.180
author img

By

Published : Mar 30, 2020, 5:59 AM IST

Updated : Mar 30, 2020, 8:38 AM IST

రాష్ట్రంలో మాంసం దుకాణాల ముందు జనాలు క్యూ కట్టారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వెలవెలబోయిన దుకాణాలు ఆదివారం ఒక్కసారిగా కిక్కిరిసి కనిపించాయి. హైదరాబాద్‌ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9.30కే మాంసం అందుబాటులో లేకుండా పోయింది. మటన్‌ ధర గతంలో ఎన్నడూ లేనంతగా కిలో రూ.800 అయ్యింది. బోన్‌లెస్‌ అయితే కిలో రూ.950 నుంచి రూ.1,000 పలికింది. మార్కెట్‌లో కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ రూ.180, డ్రెస్‌డ్‌ రూ.155, లైవ్‌ రూ.105కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.200 వరకూ విక్రయించారు. గత ఆదివారం చికెన్‌ కోసం 12 మంది మాత్రమే వస్తే, ఈ వారం ఉదయం 10 గంటలలోపే సుమారు 40 మంది వచ్చారని ఉప్పల్‌లో ఓ చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు తెలిపారు. చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతుండడం వల్ల డిమాండ్‌ అమాంతం పెరిగింది. కోడి గుడ్డు ధర గత వారం రూ.3 నుంచి 3.50 వరకూ ఉంటే ఇప్పుడు రూ.5కి పెరిగింది.

దొరకని చేపలు..

మార్కెట్లలో చేపలు అందుబాటులో లేకుండా పోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో చేపల వేట ఊపందుకున్నా అవి నగరాల్లోకి రావడం లేదు. రవాణా వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో చేపల వినియోగం 70శాతం తగ్గింది. హైదరాబాద్‌లో కేవలం 10శాతం వినియోగం ఉంది. సాధారణంగా సెలవు రోజుల్లో హైదరాబాద్‌లో 300 నుంచి 400 క్వింటాళ్ల చేపల విక్రయాలుండాలి కానీ ప్రస్తుతం 30 నుంచి 40 క్వింటాళ్లే దొరకుతున్నాయని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కూరగాయలదీ అదే పరిస్థితి...

రైతు బజార్లలో టమాటా ధర రూ.9ఉంటే కాలనీల్లో అదే టమాటాను రూ.20 వంతున అమ్మేశారు. హైటెక్స్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లో సంచార రైతుబజారు వాహనాలు ఇష్టానుసారం ధరలకు అమ్మాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట పాలు దొరకని పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ సూపర్‌ బజారు వాళ్లు పాలు తెచ్చి పెడుతున్నారు.

ఇవీ చూడండి: 'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'

Last Updated : Mar 30, 2020, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.