కరోనా కట్టడికోసం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ దోమలగూడ కంటైన్మెంట్ జోన్ చెక్‌పోస్ట్‌ను ఆయన తనిఖీ చేశారు. వివిధ కారణాలతో జోన్ నుంచి బయటకు వెళ్లేందుకు వచ్చిన వ్యక్తులను మందలించారు.
ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం మల్లాపూర్‌లో ఉన్న పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌ను పరిశీలించారు. హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో 300 మంది జీహెచ్ఎంసీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఇదీ చదవండిః ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం