ETV Bharat / state

పోలీసుల ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు.. ఈ నెల 20 వరకే గడువు.. - ts news

Police Recruitment: పోలీసు నియామక మండలి భర్తీ చేయనున్న కొలువులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలకు ఇప్పటివరకు 5లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. మరో 2లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అక్రమాలకు తావులేకుండా దరఖాస్తు ప్రక్రియ నుంచి తుదిపరీక్ష వరకు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు.

పోలీసుల ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు.. ఈ నెల 20 వరకే గడువు..

author img

By

Published : May 17, 2022, 3:42 AM IST

Updated : May 17, 2022, 4:21 AM IST

పోలీసుల ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు.

Police Recruitment: రాష్ట్రంలో భర్తీ చేయనున్న 17వేలకు పైగా పోలీస్‌ అనుబంధ విభాగాల్లోని ఉద్యోగాలకు నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నెల 2న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 20వ తేదీన ముగుస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో గడువు పెంచేది లేదన్న పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రావు.. అభ్యర్థులు చివరివరకు వేచిచూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. తుది గడువునకు మరో నాలుగురోజులే ఉండటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చే చరవాణి నెంబర్, మెయిల్ ఐడీలకే చివరి వరకు సందేశాలు వస్తాయన్న అధికారులు... పదో తరగతి మోమోలోని వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసు నియామక మండలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. గతంలో ఒకరికి బదులు మరోకరు దేహదారుఢ్య పరీక్షలకు హాజరైనట్లు బయటపడింది. చాలామంది పరుగు, లాంగ్‌జంప్‌లో విఫలమవుతుంటారు. అక్కడ అసలు అభ్యర్థి బదులు మరొకరు పరుగెత్తిన ఘటనలు ఉన్నాయి, వాటికి అడ్డుకట్ట వేయడానికి అభ్యర్థుల వేలిముద్రలను సేకరించనున్నారు. అభ్యర్థి ప్రాథమిక అర్హత పరీక్ష నుంచి దేహదారుఢ్యం , తుదిపరీక్షలు రాసేవరకు 9సార్లు అభ్యర్థుల వేలిముద్రలను సేకరించి సరిపోల్చనున్నారు. తద్వారా ప్రాథమిక అర్హత పరీక్ష రాసినవారు కాకుండా ఇతరులెవరైనా వస్తే వెంటనే గుర్తించే అవకాశముందని భావిస్తున్నారు.

శారీరక సామర్ధ్య పరీక్షలు నిర్వహించే 12 మైదానాల్లో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. మార్కులపై అభ్యంతరాలున్నవారు సంప్రదిస్తే సీసీ కెమెరాల్లో పూర్తి వివరాలు చూపిస్తారు. రేడియో ఫ్రీక్వెన్సి గుర్తింపుతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ అభ్యర్థి చేతికి వేయడం ద్వారా అతని కదలికను ఖచ్చితంగా తెలుసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి కోర్టు వివాదాలు వచ్చినా ఆ సాక్ష్యాలను సమర్పించి ప్రక్రియ ముందుకుసాగేలా పోలీస్‌ నియామక మండలి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 17, 2022, 4:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.