ETV Bharat / state

Martyrs Memorial Day Celebrations in Telangana : అమరుల త్యాగనిరతి.. తెలంగాణ ప్రగతికి స్ఫూర్తి - తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవం

Martyrs Memorial Day Celebrations Today : రాష్ట్రవ్యాప్తంగా అమరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ గన్​పార్క్‌ వద్ద పలువురు నేతలు అమరవీరులకు నివాళులు అర్పించారు. జిల్లాల్లోనూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజాప్రతినిధులు అమరులకు అంజలి ఘటించారు. భవిష్యత్‌ తరాల కోసం వారు చేసిన త్యాగమే.. నేడు తెలంగాణ ప్రగతికి స్ఫూర్తిగా నిలుస్తోందని కీర్తించారు.

martrys day
martrys day
author img

By

Published : Jun 22, 2023, 9:47 PM IST

అమరుల త్యాగనిరతి.. తెలంగాణ ప్రగతికి స్ఫూర్తి

Telangana Decade Celebrations 2023 : రా‌ష్ట్ర సాధన ఉద్యమం.. ప్రపంచ ప్రజా ఉద్యమాల చరిత్రలోనే సమున్నతమైనదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేళ వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున కొలువైన అమరుల స్మారక స్థూపం సాక్షిగా త్యాగధనులను గుండెల్లో పెట్టుకుంటామన్న కేటీఆర్​.. నాలుగు కోట్ల ప్రజల సేవలో పునరంకితం అవుతామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రగతిలో అమరవీరుల త్యాగనిరతి ప్రకాశిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్​పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నివాళులర్పించారు. కళాకారులు పాడిన తెలంగాణ ఉద్యమ పాటలకు కవిత గొంతు కలిపి చప్పుళ్లు కొడుతూ పాట పాడారు. పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హనుమకొండలో కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికే గర్వకారణంగా నిలిచేలా రాష్ట్రం సాధిస్తున్న ప్రగతే అమరులకు నిజమైన నివాళి అని మంత్రి అభిప్రాయపడ్డారు.

మహబూబాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ నివాళి అర్పించారు. కలెక్టర్, జెడ్​పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యే శంకర్ నాయక్​లతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కొయ్యగుట్ట చౌరస్తాలొ అమర వీరుల స్థూపానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అమరవీరుల ఆశయసాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ అన్నారు. మహబూబ్​నగర్‌లోని ఆర్​ అండ్​ బీ అతిథి గృహం ఆవరణలోని అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి అమరులకు నివాళులు అర్పించి.. వరంగల్ జాతీయ రహదారిపై నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఖమ్మంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డిపో రోడ్డులో అమరుల స్తూపానికి మంత్రి పువ్వాడ అజయ్‌ నివాళులు అర్పించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అమరులను స్మరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి రింగ్ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వరకు కళాకారులు డప్పు దరువులతో, నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరకు సాధించిన అభివృద్ధికితోడు పేదలు, బడుగువర్గాల వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేయాల్సిన అవసరముందని నేతలు ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.