ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నిమ్స్ వైద్యుడు మార్తా రమేశ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షునిగా రమేశ్‌ను, ప్రధాన కార్యదర్శిగా నందకుమార్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విఠల్... తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగసంఘాలు మరింత క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉద్యోగసంఘాలు సామాజిక బాధ్యతతో పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినట్లు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశారన్న ఆయన... టీఎస్పీఎస్సీ ద్వారానే 36వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇంకా ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి