ETV Bharat / state

వివాహిత అదృశ్యం.. మూడురోజులుగా దొరకని ఆచూకీ - సికింద్రాబాద్​

వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్​ సమీపంలోని తిరుమలగిరి పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె ఆచూకీ ఇంకా దొరకకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

married women missing at secundrabad hyderabad
వివాహిత అదృశ్యం.. మూడురోజులుగా దొరకని ఆచూకీ
author img

By

Published : Mar 14, 2020, 4:16 PM IST

సికింద్రాబాద్​ తిరుమల గిరి పోలీస్​స్టేషన్​ పరిధిలో మూడు రోజుల క్రితం సుమిత్ర అనే వివాహిత అదృశ్యమైంది. తిరుమలగిరిలో నివాసముండే నేమారామ్​-సుమిత్ర దంపతులు స్థానికంగా ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఓ రోజు సుమిత్ర షాపు నుంచి బయల్దేరి ఇంటికి వెళ్లింది. ఆమె భర్త దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో సుమిత్ర కనిపించలేదు.

స్థానికులు, బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. దానితో నేమారామ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె ఇంకా ఇంటికి రాకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆమె షాప్ నుంచి ఆవేశంగా బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వివాహిత అదృశ్యం.. మూడురోజులుగా దొరకని ఆచూకీ

ఇదీ చూడండి : 'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.