ETV Bharat / state

సామూహిక వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి కొప్పుల - 21 నిరుపేద జంటలు

ఆసరా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో 21 నిరుపేద జంటలకు అంగరంగ వైభవంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో వివాహాలు జరిగాయి. ఈ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ హాజరయ్యారు.

సామూహిక వివాహా వేడుకలో పాల్గొన్న మంత్రి కొప్పుల
author img

By

Published : Mar 24, 2019, 8:24 PM IST

Updated : Mar 24, 2019, 9:46 PM IST

సామూహిక వివాహా వేడుకలో పాల్గొన్న మంత్రి కొప్పుల
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో సామూహిక వివాహాలు జరిగాయి. ఆసరా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 21 జంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో వివాహాలు ఘనంగా నిర్వహించారు.

ఫౌండేషన్​ వ్యవస్థాపకులు పెంట రాజేశ్ దంపతులు కాళ్లు కడిగి కన్యాదానం చేసి వివాహాలు జరిపించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ హాజరయ్యారు. మంత్రి నిరుపేద జంటలకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. పెళ్లి వేడుకలకు వచ్చిన వారందరికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ ప్రశంసించారు. కొప్పుల ఈశ్వర్​ నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

ఇవీ చూడండి: 'ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్'

Intro:TG_KRN_31_24_SAMUHIKA_VIVAHALU_MINISTER_AVB_C7, A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST)99394450191

Body:ghy

Conclusion:
Last Updated : Mar 24, 2019, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.